ఆలయాల అభివృద్ధి కి ప్రభుత్వం ప్రాధాన్యత
ఏడుపాయలకు 100 కోట్లు మంజూరు పట్ల ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం
ఒర్రె నోళ్ళను ఓర్రనివ్వండి
ఓర్రీ ఓర్రీ అవే మూతపడతాయి
పాపన్న పెట్ ప్రజా గొంతుక
ఆలయాల అభివృద్ధి కి ప్రభుత్వం ప్రాధాన్యత
ఏడుపాయలకు 100 కోట్లు మంజూరు పట్ల ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
ఒర్రె నోళ్ళను ఓర్రనివ్వండి ఓర్రీ ఓర్రి అవే మూతపడతాయని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు ఏడుపాయల అభివృద్ధికి 100 కోట్లు మంజూరై నట్లు జీవో విడుదలపై బుధవారం ఏడుపాయల దుర్గమ్మ సన్నిధిలో పూజలు నిర్వహించిన అనంతరం కెసిఆర్ చిత్రపటానికి ఆమె అభిమానులతో కలిసి క్షీరాభిషేకం చేశారు అనంతరం ఏడుపాయలకు తరలివచ్చిన నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాద్రాద్రి, రాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశారని, అదేవిధంగా ఏడుపాయల వన దుర్గ మాత ఆలయ అభివృద్ధికిరూ.100 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఏడుపాయల్లో కాటేజీ లసౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నిధులతో కాటేజీల నిర్మాణం, ఏడుపాయల్లో మౌలిక వసతులు కల్పనతో పాటు ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఏడుపాయల అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ తయారు చేయనున్నట్లు వివరించారు. ఏడుపాయల అభివృద్ధి విషయంలో అందరి
సలహాలు సూచనలు ఇస్తామని స్వీకరిస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందు వెళ్తున్న తనపై ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసిన ప్రజల అండదండలు ఉన్నంతవరకు తనకు ఏం కాదన్నారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఎమ్మెల్యేలకు కు ఘన స్వాగతం
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్ర మైన ఏడుపాయల అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రూ.100 కోట్లు మంజూరు చేయడంతో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి గార్లకు పాపన్నపేట మండల పరిధి లోని లక్ష్మి నగర్ ఏడుపాయల కామన్ వద్ద పార్టీ కార్యకర్తలు, నాయకులు టపాసులు కాల్చి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. కళాకారుల కోలాటాలా మధ్య ఏడుపాయల వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి దుర్గామాత కు బోనం తీసి ఒడిబియ్యం పోసి మొక్కు మొక్కుబడులు చెల్లించుకున్నారు .
గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి కార్యకర్తలు, నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడుపాయలు చైర్మన్ బాలా గౌడ్, పాపన్నపేట, మెదక్, శంకరంపేట మండలాల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, అంజా గౌడ్, రాజు, ఆలయ పాలక మండలి సభ్యులు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు తదితరులు ఉన్నారు.