*జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి*
ప్రజా గొంతుక న్యూస్/చిన్నంబావి ప్రతినిధి/అక్టోబర్/02
మండలంలోని గడ్డ బసాపురం గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మందడి సత్యరాణి మాట్లాడుతూ మన ప్రపంచం శాంతి కి మార్గదర్శి అని గాంధీ గారు దేశానికి చేసిన సేవలనుకొనియాడారు,దేశం అంతటిని ఒకే తాటిపైకి తెచ్చి స్వాతంత్రాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర వహించి తన చివరి శ్వాస వరకు శాంతి అహింసా మార్గాలను ప్రచారం చేశారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన వ్యక్తి అని,అహింస మార్గన్ని ఎంచుకొని,బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన”గాంధీజీ”అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సెక్రటరీ గీ రెడ్డి రమేష్ రెడ్డి,ఉప సర్పంచ్ మాధవి కరుణాకర్,వార్డు మెంబర్లు ఏమేలమ్మ,చంద్రకళ,అరవిందు.గ్రామ పెద్దలు బుడ్డన్న,బీసన్న,ఎన్ బిసన్న,మునిస్వామి,నర్సమ్మ,బాలమ్మ,చెన్నమ్మ మంజుల,శ్యంసన్ మరియు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు..