పెద్ద నల్లబల్లిలో 18,201/- ధర పలికిన గణపతి లడ్డు ప్రసాదం
ప్రజాగొంతుక ప్రతినిధి/ దుమ్ముగూడెం:
దుమ్ముగూడెం మండలంలోని పెద్ద నల్లబల్లి గ్రామంలో పద్మనాభం గుంపులోని గణేష్ ఉత్సవ కమిటీ వారు లడ్డుప్రసాదానికి వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో గ్రామానికి చెందిన మట్టా సురేష్ అనే వ్యక్తి అత్యధికంగా 18, 201/- రూపాయలకు లడ్డు ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు బ్యాండ్ మేళం తో లడ్డు ప్రసాదాన్ని మట్టా సురేష్ ఇంటికి తీసుకువెళ్లి అందజేశారు.