*కుక్కలు దాడితో 5 గొర్రెలు మృతి..
*మరో 5 గొర్రెలు పరిస్తితి విషమం
*కొండన్న గూడెం లో దుర్ఘటన
*ప్రజా ప్రతినిధులు తమను ఆదుకోవాలని బలమోని యాదమ్మ వేడుకోలు*
*ప్రజా గొంతుక :షాద్ నగర్ ప్రతినిధి*
కుక్కల దాడులతో 5 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన కోండన్న గూడెం లో చోటుచేసుకుంది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… బతుకుదెరువు నిమిత్తం గొర్రెలు కాస్తూ బాలమోణి యాదమ్మ జీవనం కొనసాగిస్తుంది. రంగారెడ్డి జిల్లా కోండన్న గూడెం గ్రామనికి చెందిన బలమోని యాదమ్మ కొండన్న గూడెం గ్రామంలో సోమవారం గొర్రెలను కాస్తు తనకున్న పశువుల షెడ్డులో కట్టిసే వెళ్ళగా …
అర్ధరాత్రి ఎవ్వరు లేని సమయంలో గ్రామం లో ఉన్న గొర్రెల మంద పై విధి కుక్కలు తీవ్రంగా దాడులతో విధ్వంసం సృష్టించాయి. దీంతో 5, గొర్రెలు మృత్యువాత ,మారో 5 గొర్రెల పరిస్థితి విషమంగా ఉందని వాపోతున్నారు. దాదాపు 1 లక్ష వరకు నష్ట పోయామని ఆవేదన చెందుతున్నారు.గొర్రెల మృత్యువాత పడటంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని బాగోద్వేగానికి గురయ్యారు.
తమకు కుక్కల బెడద నుండి గొర్రెలను రక్షించాలని బాదితులు తమ గోడును వెలబోసుకుంటున్నరు . స్తానిక ప్రజా ప్రతినిధులు మానవతా దృక్పథంతో తమకు తోచినంత సహయ సహకారాలు అందించి ఆదుకోవాలని బలమొని యాదమ్మ వేడుకుంది.