మృతుడి కుటుంబానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5000 ఆర్థిక సాయం
*ప్రజా గొంతుక :కల్వకుర్తి ప్రతినిధి,పార్థు*
కడ్తాల్ మండలంలోని న్యామంతపూర్ గ్రామపంచాయతీకి చెందిన రామచంద్రయ్య రాత్రి అనారోగ్యంతో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ వెంటనే న్యామంతపూర్ చేరుకొని రామచంద్రయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రామచంద్రయ్య మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తదుపరి ఆయన కుటుంబ సభ్యులకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5000 రూపాయల ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గోపాల్ సర్పంచ్ రవీందర్ రెడ్డి సులోచన సాయిలు నాయకులు మహేష్ జానకిరామ్ మల్లేష్ యాదగిరి నాయకులు తదితరులు పాల్గొన్నారు.