
వడ్డెర కులస్తులు అందరూ ఐక్యతగా ఉండాలి
నూతన వడ్డెర సంఘం పట్టణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
అన్వేషణ న్యూస్ /బచ్చన్నపేట మండలం
తెలంగాణ వడ్డెర సంఘం
జనగం జిల్లా కార్మిక సంఘం అధ్యక్షులు దండుగుల రాజు అధ్యక్షతన బచ్చన్నపేట పట్టణ ముఖ్య నాయకుల సమావేశం
వడ్డెర కాలనీ లో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయిలమల్లు విచ్చేసి పట్టణ వడ్డెర సంఘం నూతన కమిటీని నియమించారు. పట్టణ అధ్యక్షుడిగాదండ్ల వెంకటేష్ ని, పట్టణ గౌరవ అధ్యక్షుడిగా, గొలుసుల ఎల్లయ్య ని, పట్టణ ప్రధాన కార్యదర్శిశివరాత్రి తిరుపతి ని, పట్టణ ఉపాధ్యక్షుడిగా, ఇరుగదిండ్ల థాజు ని
పట్టణ కార్యదర్శి శివరాత్రి నవీన్,పట్టణ కోశాధికారి బోదాస్ వెంకటేష్, పట్టణ యుత్ అధ్యక్షుడిగాదండ్ల మురళీకృష్ణ ని నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు. తదనంతరం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయిలమల్లు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా మన వడ్డెర్ల బతుకులో ఎలాంటి మార్పు రావడం లేదు మన బతుకులు మారి మన జీవితాల్లో మార్పు రావాలంటే వడ్డెర్లంతా ఐక్యతగా ఉండి భావితరాల భవిష్యత్తు కోసం రానున్న రోజుల్లో వడ్డెర్ల ఎస్టీ సాధనకై అందరం కలిసికట్టుగా పని చేయాలని అన్నారు. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ అయితే వడ్డెర్ల హక్కుల కోసం స్పష్టమైన హామీ ఇస్తుందో ఆ పార్టీకే వడ్డెర్లమద్దతుఉందనితెలియపరిచారు. ఈకార్యక్రమంలో
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఎత్తరి గణేష్, జిల్లా అధ్యక్షులుశివరాత్రి రాజు, జిల్లా కార్యదర్శిశివరాత్రి రాజనర్సు, మండల కన్వీనర్శివరాత్రి రాజు, మండల కార్యదర్శి.బోదాస్ నరసింహ, మండల మహిళా అధ్యక్షురాలుసూర నైమ ,తదితరులు పాల్గొన్నారు