కన్నుల పండుగగా బతుకమ్మ ఉత్సవాలు…
*వైకుంటపురం కాలనీలోని ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు
*అధ్యక్షులు ఏ కృష్ణ గౌడ్
*ప్రజా గొంతుక న్యూస్:రంగా రెడ్డి, జిల్లా బ్యూరో
_ బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ లోని నాదర్గుల్ కార్పొరేట్,శ్రీ వైకుంటపురం కాలనీలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. కాలనీలోని మహిళామణులు అందరూ రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ,ఉత్సాహంగా బతుకమ్మ పాటలతో సద్దుల బతుకమ్మ ఉత్సవాలను జరుపుకున్నారు. డీజే పాటలతో ,బతుకమ్మ పాటలతో మహిళా మణులు సంతోషంగా బతుకమ్మలు ఆడారు._
_ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ పెద్దలు ,కాలనీ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. అనంతరం సద్దుల బతుకమ్మలను సమీపంలోని సున్నం చెరువు దగ్గర పోయిరా బతుకమ్మ అంటూ చెరువులోకి సాగనంపడం జరిగింది._
_ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు ఏ..కృష్ణ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదేవిధంగా కాలనీ అభివృద్ధితోపాటు వినాయక ఉత్సవాలను ,బతుకమ్మ సంబరాలను ఆనందదాయకంగా గడపాలని తెలియజేయడం జరిగింది. అదేవిదంగా,దసరా (విజయ దశమి) పండగ సందర్భంగా విజయానికి ప్రతీకగా నిలుస్తుంది అని తెలిపారు. ఆదివారం దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను వివిధ అలంకరణలో పూజలు చేసి ఉపవాసదీక్షలు చేస్తారని అనంతరం విజయదశమి (దసరా) రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారని భక్తిభావాలు విలసిల్లేలా ఈ పండగను జరుపుకోవడం ఎంతో శుభపరిణామమని అన్నారు. దసరా పండగను కాలనీలలో ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.