రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపుమేరకు ఈరోజు నిడమనూర్ మండలంలో బంద్ నిర్వహించడం జరిగినది
ప్రజాగొంతుక ప్రతినిధి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గము
స్వర్ణకారుల ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మన హక్కులు సాధించుకోవడానికి ఈరోజు నిడమనూరులో షాపులు బందు పాటించడం జరిగినది. నిడమనూర్ తాసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది
తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకు రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది
స్వర్ణకారుల మనుగడను దెబ్బతీసే విధంగా కార్పోరేట్ వ్యవస్థ లు పుట్టుకు వచ్చి బంగారం రేట్లు పెరిగిపోవడంతో స్వర్ణకారుల జీవనోపాధి అధ్యయంగా మారి 10 నుంచి 15 కుటుంబాలు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగినది కావున చేతి వృత్తుల దారులను వెసులుబాటు కల్పించాల్సిందిగా కోరుతున్నాము.
కార్పొరేట్ జ్యువలరీ షాపులలో పుస్తె మెట్టెలు వంకి లక్ష్మీ రూపులు అమ్మకుండా ఒక జీవో ని ప్రభుత్వం తీసుకురావాలని కోరుతున్నాము మరియు స్వర్ణ వృత్తి చేసుకుంటున్నా వారు అకాల మరణం చెందినట్లయితే వారికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాము 50 సంవత్సరాలు దాటినటువంటి స్వర్ణకారులకు ఐదువేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు మండల కాసోజు కృష్ణమాచారి ప్రధాన కార్యదర్శి విశ్వనాధుల రమేష్ చారి కోశాధికారి అనుముల నరసింహ చారి కాలే వసంతరావు కాసోజు వెంకటాచారి ముంజ అనిల్ కుమార్ తుడిమిల్ల నాగ చారి జిల్లెపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు