పర్యావరణాన్ని కాపాడుతున్న మెకానిక్
ప్రజా గొంతుక న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
చర్లమండలంలోని సాధారణ మెకానిక్ అయినా సూరంపూడి మహేంద్ర బాబు పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అంటూ పూర్వం మన చర్ల మండల స్థానికులు పెద్దలు అధికారులు ఉపాధ్యాయులు వ్యాపారస్తులు ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి చెట్లను నాటారు.
ఆ చెట్లు ఇప్పుడు పెద్ద వృక్షాలై ఆదివారం సంతకొచ్చే మన ఆదివాసిలకు. చర్ల మండల ప్రజలకు నీడనిస్తున్నాయి. మహేంద్ర బాబు ముందు కూడా రెండు చెట్లని నాటి నలుగురికి నీడనివ్వాలి సంకల్పంతో మన రఘు థియేటర్ మెయిన్ రోడ్ లో సూరంపూడి మహేందర్ మెకానిక్ చెట్లను నాటారు. మనం చెట్లని కాపాడితే ఆ చెట్లే మనల్ని కాపాడతాయి. అనే నినాదంతో ముందుకు వెళ్తున్నా సూరంపూడి మహేందర్ బాబు. ఈ కార్యక్రమంలో గోరంట్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.