మేడ్చల్ మల్కాజిగిరి కరాటే పోటీలను నందు జాతీయస్థాయి కరాట పోటీ
ప్రజా గొంతుక నవంబరు 20 దేవరకొండ జిల్లా నల్గొండ
మేడ్చల్, మల్కాజ్ గిరి నుందు జాతీయ స్థాయి కరాటే పోటీలను జి. సాయికుమార్ నిర్వహించగా, మన దేవరకొండ నుంచి అయుష్ కరాటే విద్యార్థులు పాల్గొని తమ కట విభాగం లో ప్రతిభను కనపరిచి జయ సాయి కార్తీక్,శ్రీజన్, ఏశ్వంత్ లు స్వర్ణ పథకాలను సాధించారు.
మరియు అయుష్ కరాటే అకాడమీ ఫౌండర్ & డైరెక్టర్ : మాస్టర్, చైతన్య బెస్ట్ మాస్టర్ అవార్డు (లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు) ట్రోఫి సర్టిఫికెట్ ను మాస్టర్స్ ఆర్గనైజర్ సాయికుమార్ , కేశవ్ గౌడ్ , గొప్పన , విజయ్ కుమార్ , విట్టల్ మాస్టర్ చేతుల మీదుగా, మాస్టర్ చైతన్య ను శాలువాతో సత్కరించారు,విజేతలైన విద్యార్థులను మెడల్స్ అందించారు. ఈ సందర్బంగా మాస్టర్ చైతన్య మాట్లాడుతూ డిల్లీ ఆగ్ర తాజ్ మహల్ కు సమీపంలో,డిసెంబర్ 30,31వ తారీకులలో అంతర్జాతీయ స్థాయి పోటీలలో తమ విద్యార్థులు సిద్దమౌతునట్లు అయన తెలిపారు,
మరియు ప్రస్తుత సమయం లో పిల్లలకు ముఖ్యగా ఆడపిల్లలకు ఆత్మ రక్షణ కొరకు మరియు మంచి ఆరోగ్యం కొరకు ప్రతి పిల్లల్ని కరాటే నేర్చుకోవాలి అయన తల్లిదండ్రులను కోరారు. మన దేవరకొండ పట్టణంలో ప్రతి విద్యార్థిని విద్యార్థులకు తీర్చిదిదుటకు మీనాక్షి ప్లాజా, తాటికొల్ X రోడ్ నందు తమ అకాడమీ లో ఉదయం మరియు సాయంత్రం శిక్షణ ఇస్తూ తమ వంతు అనునిత్యం కృషి చూస్తునమని మరియు దేవరకొండ పట్టణ వాసులు ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకోవాలని తమ పిల్లలల్ని ఆరోగ్యం వంతులుగా, ప్రతిభవంతులగా చేయాలనీ కోరారు.