ఎన్నికలనిర్వహణసందర్భంగాజిల్లాపోలీసుకార్యాలయం నందుపోలీస్ పరిశీలకులు, ఎన్నికల జనరల్ పరిశీలకులతో సమీక్ష సమావేశం…
గద్వాల జిల్లా ఎస్పీ రితి రాజ్.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
శాసన సభ ఎన్నికలకు జిల్లా కు వచ్చిన జనరల్ పరిశీలకులు పి.వసంత కుమార్ ఐ. ఏ. ఎస్, పోలీస్ పరిశీలకులు అనుపo శర్మ ఐ.పి.ఎస్ తో జిల్లా ఎస్పీ రితిరాజ్ జిల్లాపోలీస్,కార్యాలయం లో సమావేశమై ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ తీసుకున్నా చర్యలను, చేపట్టబోయే చర్యలను జిల్లా ఎస్పీ వివరించారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీరితిరాజ్,మాట్లాడుతూ,జిల్లాలోఉన్నరెండునియోజకవర్గాలకుపోలీసు నోడల్ అధికారులను ఏర్పాటుచేయడంజరిగినదని,ఎన్నికలవిధులపైపోలీసుఅధికారులకుసిబ్బందికి,శిక్షణకార్యక్రమాలు నిర్వహించిన వివరాలను జిల్లా ఎస్పీ రీతిరాజ్ తెలియజేశారు. అంతరాష్ట్ర సరిహద్దు వెంట ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వివరాలు, ట్రబుల్స్ మాంగర్స్ ను బైండోవర్ చేసిన కేసుల వివరాలు, సమస్యాత్మక పోలింగ్ గ్రామాల్లో చేపట్టిన రక్షణ చర్యలు, ఆయా పోలీస్ స్టేషన్ ల పరిదిలో వాహనాల తనిఖీలు, కేంద్ర బలగాల సద్వినియోగం, ఫ్లయింగ్ స్క్వాడ్, స్ట్రైకింగ్ పోర్ట్స్, స్పెషల్ స్ట్రింకింగ్ ఫోర్స్ పని విధానం, సోషల్ మీడియా మానిటరింగ్ మొదలగు అంశాల గురించి వివరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో ప్రణాళిక ప్రకారం రక్షణ చర్యలు తీసుకుంటున్న తీరు, గత ఎన్నికలలో నేరాలకు పాల్పడిన వారి సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వారిని ముందస్తుగా బైండోవర్ చేసిన వివరాలు, జిల్లా లో ఎన్నికల కోడ్ అనంతరం తనిఖీల్లో సీజ్ చేసిన నగదు,ఇతర వస్తువులు, మద్యం వివరాలు , ఎన్.బి డబ్ల్యూ ఎస్ ఎక్జీక్యూట్ వివరాలు, సి-విజిల్ ద్వారా వచ్చిన పిర్యాదు ల వివరాలు, కేంద్ర భలగాలతో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రత, ఓట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయబోయే మూడు అంచల భద్రత గురించీ జిల్లాఎస్పీతెలియజేశారు
జిల్లాలో,గ్రామాల్లోపట్టణాల్లో కేంద్ర బలగాల కవాతు , ప్రజలకు ఓటు వినియోగం పై కళా బృందంద్వారాచేపడుతున్న అవగాహన కార్యక్రమాల వివరాలు జిల్లాఎస్పీతెలియజేశారు
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవి, సాయుధ దళ డి. ఎస్పీ ఇమ్మనియోల్ పాల్గొన్నారు.