మీకోసం మేమున్నాం టీం నిర్వహిస్తున్న వారాంతపు అన్నదానం
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ప్రతినిధి
ప్రతీ ఆదివారం అన్నదానం 101 వ వారం కార్యక్రమంలో భాగంగా,కర్తిశేషులు కుక్కల శ్రీనివాస చక్రవర్తి గారి వర్థంతి సందర్భంగా- వారి కుమార్తె – అల్లుడైన శ్రీమతి లిఖిత – సత్యేంద్ర కుమార్ దంపతుల4,000/- వితరణతో, చర్ల గాంధీ సెంటర్ వద్ద సుమారు 200 మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం జరిగింది. ఈ విధమైన అన్నదానాలతో తమతమ శుభకార్యాలను ఈ పేదవారి దీవెనలతో జరుపుకోవాలని చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ కోరారు.
ఈ కార్యక్రమంలో లిఖిత, సత్యేంద్ర కుమార్, దొడ్డి రమణారావు, సూరిబాబు, పరిటాల రమణ మాష్టారు, జవ్వాది సతీష్, బొక్క శ్రీనివాసరావు, మర్ల ప్రసాద్ మాష్టారు, దొడ్డ ప్రభుదాస్, కొమారి శ్రీను, గొమ్ముగూడెం చారి, భద్రం, తదితరులు పాల్గొన్నారు.