మద్యం మత్తులో హల్చల్ చేసిన యువకుడు
పాపన్నపెట్ ప్రజా గొంతుక న్యూస్
ఎన్నికల కిక్కే కిక్కు మద్యం మత్తులో హల్చల్ చేసిన యువకుడుఅభ్యర్థులు గెలిచిన తర్వాత అభివృద్ధి చేసుడు దేవుడెరుగు కానీ.. మద్యం మత్తులో యువకులు, పెద్దలు ప్రమాదాల బారిన పడుతున్నారు. పార్టీల నాయకులు ఇచ్చిన సొమ్ముతో తాగుతున్నారో లేదా వారి సొంత డబ్బులతో తాగుతున్నారో కానీ.. పార్టీల అభ్యర్థుల ప్రచారాల్లో మాత్రం హల్ చల్ చేస్తున్నారు. ఇట్లాంటి ఘటనే గురువారం అమ్రియా తండాలో చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం అమ్రియా తండాలో ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో అదే తండా కు చెందిన వికాస్ అనే యువకుడు మద్యం మత్తులో అక్కడికి వచ్చి హల్ చల్ చేశాడు. అక్కడే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకుంటానంటూ.. దాని గద్దెపై ఎక్కి కింద పడే క్రమంలో అక్కడ ఉన్న యువకులు పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
పోలీసులు సముదాయించే క్రమంలో వారిపై కూడా తిరగబడ్డాడు. గ్రామస్తులు, యువకులు జోక్యం చేసుకోని పక్కకు తీసుకెళ్లారు.