*చైన్స్ స్నాచింగ్లకు పాల్పడిన యువకుడు అరెస్ట్
*మీడియా సమావేశంలో డిసిపి నారాయణరెడ్డి వెల్లడి.
*షాద్ నగర్ ప్రజా గొంతుక ప్రతినిధి
రంగారెడ్డిజిల్లా:శంషాబాద్ డిసిపి కార్యాలయంలో డిసిపి నారాయణరెడ్డి రాజేంద్రనగర్ మండల్ అత్తాపూర్ పాండురంగ నగర్ కు చెందిన వెంకటరమణ యాదవ్ వ్యక్తిని అరెస్ట్ చేశామని మీడియా సమావేశంలో తెలిపారు.ఈ సందర్బంగా పోలీసులు మాట్లాడుతూ,,షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి తీవ్ర నష్టాలు రావడంతో యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూసి వరస చైన్స్ స్నాచింగ్ పాల్పడిన వెంకటరమణ యాదవ్,మోకిలా,కొత్తూరు,నందిగామ,నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు చైన్ స్నాచింగ్ ల లోకి పాల్పడిన యువకుడు.
కాగా నిన్న కొత్తూరు మండలం అయ్యప్ప టెంపుల్ వద్ద యువకుడిని అదుపులకు తీసుకున్న విచారించగా జరిగిన విషయం అంత చెప్పాడని పోలీసులు తెలిపారు.ఇందులో 12 తులాల బంగారు చైన్లతో పాటు ఓ పల్సర్ బైక్ రెండు స్మార్ట్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.దాదాపు బంగారు గొలుసుల విలువ 7,20,000 లక్షల ఉంటుందని తెలిపారు.
అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని అన్నారు.గ్రామాలలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటేనే వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.