అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ సమసమాజ స్థాపనకే కులాంతర వివాహాలు
కులాంతర వివాహం చేసుకున్న వారికి జి.ఓ.ఎం.ఎస్.నెం.67ప్రకారం 1శాతం ఇండ్లు కేటాయించాలి
యేలేటి ఆంజనేయులు
ప్రజాగొంతుక న్యూస్ సూర్యాపేట జిల్లా
కులాంతర వివాహం చేసుకున్న వారికి ఇండ్లు ఇవ్వాలని హుజూర్ నగర్ నాయబ్ తహసీల్దార్ యం.సుధారాణి కి కులాంతర వివాహల సంక్షేమ సంఘం సభ్యులు బుధవారం వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు యేలేటి ఆంజనేయులు మాట్లాడుతూ కులాంతర, మతాంతర, వివాహాలు చేసుకున్న వారికి తల్లిదండ్రులు నుండి కానీ అత్త మామలు నుండి ఎటువంటి ఆస్తులు సంక్రమించడం లేదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ సమసమాజ స్థాపన కొరకు కులాంతర వివాహం చేసుకున్న వారిని సమాజం లో చిన్న చూపు చూస్తున్నారని ప్రభుత్వం,
ప్రభుత్వ అధికారులు కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని కులాంతర వివాహం చేసుకున్న వారికి జి. ఓ. ఎం. ఎస్. నెం.67ప్రకారం 1శాతం ఇండ్లు కేటాయించి ఇవ్వాలన్నారు హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారామ స్వామి గుట్ట దగ్గర 1000 సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లకు తహశీల్దార్ దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ ఇచ్చినందున అట్టి ఇండ్లలో కులాంతర వివాహం చేసుకున్న కుటుంబాలకు ఇచ్చి ఆదు కోవాలని విజ్ఞప్తి చేశారు.