పంట ధ్వంసం చేసిన ఫారెస్టు అధికారుల పై చర్యలు తీసుకోవాలని ధర్నా…..
ప్రజా గొంతుక ప్రతినిధి/అశ్వరావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండల పరిధిలోని మాధారం పోడు భూమి లో అర్ధరాత్రి అక్రమంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పంట చోనులలో ప్రవేశించి ప్రత్తి పంటను ధ్వంసం చేసిన ఫారెస్టు అధికారుల పై చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు డిమాండ్ చేశారు
ములకలపల్లి మండల కేంద్రంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమం లో పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఒకపక్క పోడు భూములకు పట్టాలు ఇస్తూనే మరోవైపు గిరిజనులు చేతిలో ఉన్న పోడు భూములను గుంజుకోవాలనే కుట్రలో భాగంగానే ఫారెస్టు సిబ్బందిని పోడుపై దాడులకు పురికొల్పుతున్నదని దీనిని బట్టి చూస్తే ప్రభుత్వానికి అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు
గత ముప్పై సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వకుండా దాడులుచేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు గిరిజనులు పంటను ధ్వంసం చేసిన ఫారెస్టు సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు వూకంటి రవికుమార్, గోపగాని లక్ష్మీ నరసయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, సిద్దిని రమణ, నాగేశ్వరరావు, లక్ష్మి, వెంకటేష్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.