.. పులిగిల్లలో పత్తి చేను ధ్వంసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి..
సెప్టెంబర్ 23 వలిగొండ ప్రజా గొంతుక ప్రతినిధి…
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామంలో పత్తి చేనుపై గడ్డినీ చంపే మందును పిచికారి చేయడం వల్ల 13 ఎకరాల పత్తి చేను మొత్తం ధ్వంసం కావడం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
పులిగిల్ల గ్రామానికి చెందిన బుగ్గ శ్రీశైలం పైళ్ల తరుణ్ రెడ్డి పైళ్ల విష్ణువర్ధన్ రెడ్డి ల 22 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని, తాను 9 ఎకరాలు వ్యవసాయం చేస్తూ మిగతా 13 ఎకరాల భూమిని మంద బిక్షపతి కి 3 ఎకరాలు , వేముల మధు కి 7 ఎకరాలు, బుగ్గ మల్లయ్యకి మూడు ఎకరాలు ఉప కౌలుకి ఇవ్వడం జరిగింది. ముగ్గురు కలిసి కలిసి 13 ఎకరాల భూమిలో పత్తి పంట వేయడం జరిగింది. 20వ తేదీన రోజున రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గడ్డిని చంపే మందును డ్రోన్ సహాయంతో పిచికారి చేయడంతో పంట మొత్తం ధ్వంసం అయింది.
కావున ఇట్టి విషయంపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయగలరని బాధితులు వాపోయారు. బాధితుల ఫిర్యాదుమేరకు మేరకు ఎస్సై పెండ్యాల ప్రభాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.