హమాలీలకు దసరా బోనస్ అందించిన అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్
79 మంది హమాలీలు, ముగ్గురు స్వీపర్ లకు రూ.6,500/- చొప్పున పండుగ బోనస్ చెక్ లు అందజేసిన అదనపు కలెక్టర్
ప్రజా గొంతుక పెద్దపల్లి :
జిల్లా పౌర సరఫరాల సంస్థలో పనిచేస్తున్న హమాలీలకు జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో దసరా బోనస్ చెక్ లను అందజేశారు.
జిల్లా పౌర సరఫరాల సంస్థలోని మూడు మండల స్థాయి స్టాక్ పాయింట్లలో పనిచేసే 79 మంది హమాలీలకు, ముగ్గురు స్వీపర్లకు మొత్తం 82 మందికి ఒక్కొక్కరికి 6 వేల 500 రూపాయలు చొప్పున దసరా బోనస్ చెక్ లను అదనపు కలెక్టర్ అందించారు. అలాగే ప్రతి ఒక్క హమాలీకు, స్వీపర్లకు 800 రూపాయలు స్వీట్స్ కొరకు అందజేసీ, హమాలీలకు, స్వీపర్లకు అదనపు కలెక్టర్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.