*నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ*
*చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించిన కౌన్సిలర్. వై కుమార్*
*(ఆర్ఆర్ గౌడ్ )ప్రజా గొంతుక న్యూస్ :రంగారెడ్డి జిల్లా బ్యూరో*
నిజాం దాడులకు, భూ స్వాములు కొనసాగించిన ఆకృత్యలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా,శంషాబాద్ పట్టణంలో ఐలమ్మ గారి విగ్రహానికి శంషాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్ వై కుమార్ పూల మాలతో ఘనంగా నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ కొలంన్.సుష్మా మహేందర్ రెడ్డి నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల.వెంకటేష్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గణేష్ గుప్తా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వై కుమార్ మాట్లాడుతూ
ఆనాడు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి, ఆ పోరాటం లో అసువులు బాసి అణగారిన వర్గాలకు అందరికి ఒక స్ఫూర్తి, వీరవనిత గా చరిత్ర లో నిలిచిన చాకలి ఐలమ్మ ను మనమందరం స్మరించుకోవాలని అన్నారు.తెలంగాణా లో ఉన్న మహిళలందరూ కారం పొడి, రోకలి బండలను ఆయుధాలుగా మార్చుకొని నిజాం పై పోరాటం చేసిన చరిత్ర ఎంతో గొప్పదని, ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రజక సంఘం నాయకులు కార్యకర్తలు మున్సిపల్ కౌన్సిలర్ పాల్గొన్నారు