ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ పార్టీకి ఉద్యమకారులందరూ మద్దతు తెలపాలి…
జడ్పిటిసి వాకిట్టి పద్మ అనంతరెడ్డి..
యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 20 వలిగొండ ప్రజా గొంతుక ప్రతినిధి….
యాదాద్రి భువనగిరి జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులందరూ ఉద్యమకారులను గుర్తించి నా సోనియా గాంధీకి కృతజ్ఞతగా ఉద్యమకారులందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి గెలుపు కోసం కృషి చేయాలని వలిగొండ జడ్పిటిసి వాకిటి పద్మా అనంతరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు
రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమకారులు ఆనాటి సమైక్య పాలకులు పెట్టిన నిర్బంధాలు ఎదిరించి కేసులపాలై లాటి దెబ్బలు తిని జైలు నిర్బంధాలను ఎదిరించిన నేటి వరకు కెసిఆర్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించిన పాపాన పోలేదని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్ లోనే ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం దానితోపాటు ఇల్లు కట్టిస్తామని హామీ ఇవ్వడం పట్ల జడ్పిటిసి వాకిటి పద్మా. అనంతరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఉద్యమకాలను తొక్కిపెట్టి తెలంగాణ ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకొని ఉద్యమకారులను అవహేళన చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం నేడు ఉద్యమకారులందరూ ఆర్థికంగా నష్టపోయి ఉన్న వారి గురించి ఆలోచించి ఏది ఏమైనప్పటికీ ఉద్యమకాలను గుండెలో పెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యమకారులందర్నీ గుర్తిస్తామని గుర్తింపు కార్డులు ఇచ్చి తెలంగాణ సమరయోధులుగా ఆహ్వానిస్తామని ఆయన అన్నారు