అంగన్వాడీలకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలి
అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన తాటి..
ప్రజా గొంతుక ప్రతినిధి/అశ్వరావుపేట నియోజకవర్గం,అశ్వారావుపేట మండల కేంద్రంలో అంగన్వాడి ఉపాధ్యాయుల సమ్మెకు మద్దతు తెలిపిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ
విపత్కరమైన కరోనాకాలంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇంటింటికి వెళ్లి సేవలందించారని అంగన్వాడీ ఉపాధ్యాయులకు కనీస వేతనం 26 వేల తో పాటు వారి డిమాండ్లు పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.అలానే అంగన్వాడి ఉపాధ్యాయులకు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో అమలు కానున్న అభయ హస్తం గ్యారెంటీ కార్డును వివరించారు.ఈ కార్యక్రమంలో సుంకవల్లి వీరభద్రరావు , జ్యేష్ట సత్యనారాయణ చౌదరి , దాసరి నాగేంద్రబాబు , కోడూరు శ్రీనివాస్ , మోహన్ , తమ్మిశెట్టి పోసి , ఏసు , రోశయ్య , వెంకటనారాయణ , భూక్య ప్రసాద్ , కుంజా వెంకటేశ్వరరావు , ఆకిరపల్లి రాంబాబు , మంగరాజు , కార్యకర్తలు పాల్గొన్నారు.