*వరల్డ్ కప్ లో ఇండియా
ఎన్నికల్లో కేసీఆర్ …షాద్ నగర్ లో అంజయ్య యాదవ్ గెలుపు ఖాయం?
*యువత అధ్యక్షుడు లంకాల రాఘవేంద్ర రెడ్డి*
షాద్ నగర్ :ప్రజా గొంతుక ప్రతినిధి
ఈ ఏడాది జరుగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలుపు ఖాయమని.. అలాగే తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ విజయం కూడా ఖాయమని షాద్ నగర్ పట్టణ బి ఆర్ ఎస్ యువత అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి అన్నారు.గత తొమ్మిదన్నరేళ్లలో కేసీఆర్ ఎమ్మెల్యే సర్కార్ రాష్ట్రంలో గుణాత్మక మార్పు తీసుకువచ్చిందని రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా అవి అర్హులకు కచ్చితంగా అందేలా మా అంజయ్య యాదవ్ చూశారని వెల్లడించారు. కేసీఆర్ ప్రవేశపెట్టినన్ని పథకాలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాలేదని స్పష్టం చేశారు షాద్ నగర్ ల్లో గడప గడపకు ప్రచారంలో ప్రజల బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే. అంజయ్య యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తారని హ్యాట్రిక్ పక్కాగా సాధిస్తారని రాఘవేందర్ రెడ్డి ఆశ భవాన్ని వ్యక్తం చేశారు