సంక్షేమ పథకాలు ప్రకటించడం హర్షనీయం
ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ ప్రకటన ద్వారా నిన్నటి రోజు హైదరాబాదులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి సమక్షంలో ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలను ప్రకటించడం హర్షనీయం అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సోనియా గాంధీ 6 గ్యారంటీ పథకాలు, మహాలక్ష్మి మహిళలకు ప్రతినెల 2500 రూపాయలు, 500 కే వంట గ్యాస్, రైతు భరోసా కింద ప్రతి సీజన్లో 15ను వేలు ఇస్తామని వ్యవసాయ కూలీలకు 12000 వెయ్యిలు, వరి పంటకు ప్రభుత్వ మద్దతు ధర ఫోను ప్రతి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని, గృహ జ్యోతి, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తామని, అలాగే ఇందిరమ్మ ఇండ్లు జాగా తో సహా 5 లక్షల రూపాయలు.
వృద్ధులకు ప్రతినెల 4 వేల రూపాయల పింఛన్, ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తామని చెప్పడం సంతోషకరమని. తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని. ప్రజల ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.