బచ్చన్నపేట కాంగ్రెస్ లో ఆ ఇద్దరిదే పెత్తనమా…!
కాంగ్రెస్ సీనియర్ నాయకుల రహస్య సమావేశం
ప్రజా గొంతుక/బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుమారు 50 మంది రహస్య సమావేశం అయినట్లు తెలుస్తుంది. మండల కేంద్రంలో ఓ ఇద్దరి పెత్తనంతో నలిగిపోతున్నట్టు, క్యాడర్ ను కలుపుకొని పోకుండా, ఒంటెత్తు పోకూడతో పోతు, వారు చెప్పినట్టే వినాలని చూస్తున్నారని వారి పోకడ వల్ల బారి నష్టం వాటిల్లే అవకాశముందని వారు చర్చించుకున్నట్లు తెలుస్తుంది.
కాంగ్రెస్ పార్టీ కోసం పార్టీలు మారకుండా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులు, కొమ్మూరి నాయకత్వమే కావాలని కోరుకుంటున్న కొమ్మూరి గెలుపు కోసం కృషి చేద్దామని అనుకుంటున్నా ,వారు మాత్రం వారి పెత్తనమే కావాలని చూస్తున్నారని వారు సమావేశం అయినట్లు తెలుస్తుంది. మరి కొమ్మూరి రంగంలోకి దిగి కార్యకర్తలను నాయకులతో మాట్లాడి క్యాడర్ విచిన్నం కాకుండా చూస్తారా లేక ఏం జరగబోతుందని విషయం తెలియాల్సి ఉంది.