*చింతపల్లి మండలంలో గడప గడపకు బహుజన్ సమాజ్ పార్టీ ప్రచారం
*-సాయి రెడ్డిగూడెం నరసింహ పురం కిష్టారాంపల్లి పీ.కే-మల్లేపల్లి. ఎం-మల్లేపల్లి రాయినిగూడెంలో గడప గడపకు బిఎస్పి ప్రచారం
ప్రజా గొంతుక నవంబరు 7 దేవరకొండ జిల్లా నల్గొండ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో *బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వెంకటేష్ చౌహన్* ఇంటి ఇంటి ప్రచారం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి డాక్టర్ వెంకటేష్ చౌహన్ మాట్లాడుతూ… ఏనుగు గుర్తుకు ఓటేసి బహుజన సమాజ్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపిస్తే బహుజన రాజ్యంలో ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూళ్లు మరియు మండలానికి ఒక సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్, భూమి లేని నిరుపేదలకు ఒక ఎకరం భూమి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దేవరకొండ బాంసెఫ్ అధ్యక్షులు రాజారావు నియోజకవర్గం అధ్యక్షులు వారాల ఆంజనేయులు యాదవ్ చింతపల్లి మండల అధ్యక్షుడు ముదిగొండ మొగులయ్య నియోజకవర్గ మహిళా కన్వీనర్లు లలితా సహని జనరల్ సెక్రెటరీ ఎర్ర యాదయ్య చేరికల కమిటీ అధ్యక్షులు కొండ్రపల్లి రమేష్ బీ.వి.ఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ భరత్ బీఎస్పీ నాయకులు కంబాలపల్లి గిరి వెంకటేష్ బాలకృష్ణ హనుమ నాయక్ సైదులు శంకర్ మహేష్ జగన్ సతీష్ శ్రీకాంత్ అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.