Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

*బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలి – ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎంపీపీ దిద్యాల.జయమ్మ శ్రీనివాస్

*ప్రజా గొంతుక న్యూస్:శంషాబాద్*

 

సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్.

చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశ్యంతో సీఎం కేసిర్ బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని సంకల్పించారని – ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మండల కార్యాలయాలలో గ్రామపంచాయతీ కార్యాలయాలలో

మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి చిహ్నమైన బతుకమ్మ పండుగను మహిళలందరూ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే, ముందుగా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలుతెలియజేశారు. అనంతరం మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అధికారంలో ఉన్న పాలకులు ఏనాడు ప్రజలకు ముఖ్యంగా మహిళల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు, అంతే కాదు బతుకమ్మ చీరల పంపిణీ వెనుక గొప్ప ఉద్దేశం ఉందన్నారు.

చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశ్యంతో సీఎం కేసిర్ బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని సంకల్పించారని,ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. చెప్పారు. నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తూ, చేనేత కార్మికుల ఆకలి చావులకు అడ్డుకట్ట వేశామన్నారు. తెలంగాణ ఉద్యమంతో బతుకమ్మకు గుర్తింపు వచ్చిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిరిసిల్ల చేసేత కార్మికులకు ఆకలి చావులు, వేలాది కుటుంబాలకు పనిలేక నేసిన దుస్తులు కొనేవారు లేక వారి జీవితాలు అస్తవ్యస్తంగా ఉండేవి, తెలంగాణ రాష్ట్రం వచ్చాక చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నది. విద్యార్థులకు, యువకులకు స్పోర్ట్స్ కిట్లు అందజేసినఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఈ సందర్భంగా శంషాబాద్ ఎంపీపీ దిధ్యాల జయమ్మ శ్రీనివాస్,మాట్లాడుతూ దేశంలోనే నిరుపేద కుటుంబాలకు పండుగలకు దుస్తులను అందించే తెలంగాణ రాష్ట్రం ఒక్కటే, ముఖ్యమంత్రి కెసీఆర్ దూర దృష్టి తో భారత దేశంలో పండుగ వస్తే కొత్త దుస్తులు ధరించని కుటుంబాలు ఉన్నాయి,మహిళలంతా పండగ వాతావరణం లో ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ

తెలియజేసిన ఎంపీపీ.

Leave A Reply

Your email address will not be published.