Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

బీసీ అభ్యర్థియే సీఎం…

హర్షం వ్యక్తం చేసిన బిజెపి నాయకులు…

 

మనోహరాబాద్ అక్టోబర్28(ప్రజా గొంతుక)

 

 

బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణకు బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన జన గర్జన సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడంతో బీజేపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేసారు.మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు టపాసులు కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి బక్క వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఆధ్వర్యంలో బీజేపీ లక్ష్యం పేదరిక నిర్మూలన అని,కేసీఆర్ లక్ష్యం కుటుంబ సభ్యుల అస్తులు పెంచుకోవడమే అన్నారు.బీఆర్ఎస్ పేదల,దళిత,బీసీల వ్యతిరేక పార్టీ అన్నారు.దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పిన కేసిఆర్ అధిక శాతం కల్గిన బీసీలకు ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు.

మరో సారి కెసిఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని,బీజేపీ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి బీజేపీని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నర్సుగారి గోపి,మండల కిసాన్ మోర్చ అధ్యక్షులు లింగం రాజు ముదిరాజ్,గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కర్రె శ్రీనివాస్,కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు ప్రశాంత్ ముదిరాజ్,బూత్ కమిటీ అధ్యక్షులు కనకరాజు ముదిరాజ్,స్వామి ముదిరాజ్,నాయకులు మ్యాదరబోయిన ప్రవీణ్,లింగం రమేష్,సోళ్లుగారి రామస్వామి,నింగం నాగరాజు,మామిళ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.