సోషల్ మీడియాలో జాగ్రత్త
పాపన్నపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి
పాపన్నపెట్ ప్రజా గొంతుక
ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా, సోషల్ మీడియాలో అవమానించే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పాపన్నపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, గ్రూపులపై ఇతర వ్యక్తులకు పార్టీలను రెచ్చగొట్టే విధంగా, కించపరిచేలా అవమానిస్తూ పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.