తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలు పొందిన యువతకు శుభాకాంక్షలు…
_బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జడ్పిటిసి ఉప్పల వేంకటేశ్
ప్రజా గొంతుక:కల్వకుర్తి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర పోలిస్ ఉద్యోగాలలో అవకాశం దక్కించుకున్న కల్వకుర్తి నియోజకవర్గ యువతకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నననీ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వేంకటేశ్ ఒక ప్రకటనలో పెర్కోన్నారు.యువత తమ చిరకాల కోరిక తల్లిదండ్రులు ఆకాంక్షను నేడు నెరవేర్చడమే కాకుండా ఒక గొప్ప కనుకను కష్టపడి ఇష్టమైన రీతిలో లక్ష్యం దిశగా పరుగులు పెట్టి నేడు తల్లిదండ్రులలో ఆనందోత్సాహాలు నింపిన యువతకు పేరు పేరునా అభినందనలతో శుభాకాంక్షలు తెలియజేశారు