*ఘనంగా ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలు
*శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గణేష్ గుప్తా
ప్రజా గొంతుక :రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలు శంషాబాద్ మున్సిపాలిటీ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఎంపి రంజిత్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ఎంపి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో రాజేంద్ర నగర్ శాసన సభ్యుడు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గణేష్ గుప్తా పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యకర్తలు నాయకుల ఎంపీ రంజిత్ రెడ్డి బర్త్ డే కేక్ కట్ చేయగా పార్టీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. వేడుకల్లో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.