దేవరకొండ పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో
దేశభక్తుడు పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి
ప్రజా గొంతుక సెప్టెంబరు 25 దేవరకొండ జిల్లా నల్గొండ
ఏకాత్మ మానవతావాద సిద్ధాంతకర్త, అఖండభారత స్వాప్నికుడు, తత్వవేత్త,ఆర్థికవేత్త, సామాజికవేత్త, చరిత్రకారుడు అకలంక దేశభక్తుడు పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి చెనముని రాములు మాట్లాడుతూ సమాజంలో అసమానతలు రూపుమాపడానికి అంత్యోదయ అనే ఆయుధాన్ని ప్రవచించిన నవభారత రూపశిల్పి, సాధారణ జీవితం– గొప్పగా ఆలోచించడం అనే దానికి ప్రత్యక్షంగా జీవించిన మానవతా మూర్తి పండిత్
దీన్ దయాల్ ఉపాధ్యాయ.. జనసంఘ్ వ్యవస్థాపకులలో ఒకరిగా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాన్ని “ఏకత్మతా మానవత వాదం” ప్రవచించిన వ్యక్తిగా ప్రపంచానికి తెలిసిన వ్యక్తి.. ఆ మహనీయుని జయంతి సందర్భంగా స్మరించుకుందాం అని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుండాల అంజయ్య.
జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్ బిజెపి ఫ్లోర్ లీడర్ గాజుల మురళి, రాష్ట్ర నాయకులు బెజవాడ శేఖర్, ప్రధాన కార్యదర్శిలు జల్దా భాస్కర్, సముద్రాల సహదేవ్, రూరల్ మండల అధ్యక్షులు పబ్బు సైదులు, చండీశ్వర్, గంజి హరి, అప్పం అజయ్, బిచ్చ నాయక్, పున్న వెంకటేష్, అజయ్ చంద్ర, వనం శ్రీను, మావిళ్ళ గిరి, ఎర్ర బిక్షపతి తదితరులు పాల్గొన్నారు