‘మొలుగూరి నాగమణీ’ కుటుంబానికి బీజేపీ భరోసా…
-నాగమణి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకొని అండగా ఉంటాం..!
-బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయచందర్ రెడ్డి సిరంగి సంతోష్ కుమార్
ప్రజా గొంతుక //వరంగల్ జిల్లా //సంగెం ప్రతినిధి:
సంగెం మండలంలోని నార్లవాయి గ్రామానికి చెందిన మొల్గురి
నాగమణి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకొని అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి,డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ అన్నారు.సోమవారం రోజున నార్లవాయి గ్రామనికి చెందిన
మొలుగూరి నాగమణి ఇటీవలే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింధి.విషయం తెలుసుకున్న డాక్టర్లు వారి కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పించి చెరో 5000 ఆర్థిక సాయం చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బుట్టి కుమార స్వామి,
వరంగల్ జిల్లా కార్యదర్శి మొలుగూరి శ్రీనివాస్ (చౌకిధార్ ),కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శేషాద్రి,మండల ప్రధాన కార్యదర్శి భూక్యా వెంకన్న,యువమోర్చ మండల అధ్యక్షుడు అవనిగంటి సతీష్,రాజన్,నార్లవాయి బూత్ ప్రధాన కార్యదర్శి తాళ్ళపెల్లి సోషల్ మీడియా కన్వీనర్
నాతి అనిల్ రాజమౌళి పరమెష్ రాజు కాగితాల సాయికుమార్,తదితరులు పాల్గొన్నారు