Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

మెదక్ నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి కాలేదు

 

అదే సిరిసిల్ల సిద్దిపేట చూడండి

 

ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

 

బిజేపి అభ్యర్థి పంజా విజయ్ కుమార్

 

పాపన్నపెట్ ప్రజా గొంతుక న్యూస్

 

ఇంటికో ఉద్యోగం, నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామన్న కేసీఆర్‌ వాగ్ధానం తుంగలో తొక్కాడని, హామీలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మెదక్‌ అసెంబ్లీ స్థానం బీజేపీ అభ్యర్థి పంజా విజయ్‌ కుమార్‌ ఆరోపించారు. గురువారం మండల పరిధిలోని కొంపల్లి, చీకోడ్, లింగాయపల్లి, అమ్రియా తండా, మల్లంపేట్ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణ కోసం అమరులు, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాలు చేస్తే బిఆర్ఎస్ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. నీళ్లు, నియామకాలు, నిధులు అంటూ బిఆర్ఎస్ నాయకులు కోట్లు దండుకున్నారన్నారు. గ్రామాల్లో అభివృద్ధిని చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని మండిపడ్డారు. పద్మాదేవేందర్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తుందని ఆరోపించారు. ఏడుపాయ అమ్మవారి సొమ్మును పద్మారెడ్డి భర్త దేవేందర్‌రెడ్డి కాజేశారని ఆరోపించారు. చాక్లెట్లు, బిస్కెట్లు కొన్నంత తేలిగ్గా మైనంపల్లి హనుమంతరావు తన కొడుకు రోహిత్ కు ఎమ్మెల్యే సీటును కొనుక్కున్నారని పేర్కొన్నారు. మైనంపల్లి హనుమంత రావు తన కొడుకు రోహిత్ అడిగినవన్నీ ఇస్తున్నారని, కారు అడిగితే కారు, ఎంబీబీఎస్ సీటు అడిగితే ఎంబీబీఎస్ సీటు.. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ అడిగితే టికెట్ సైతం కొనిచ్చారన్నారు. డబ్బులు వెచ్చించి టిక్కెట్లు కొనే వారు ఏం అభివృద్ధి చేస్తారో ఆలోచించాలన్నారు. భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చానని, మీ ఇంటి పెద్ద కొడుకుగా సేవ చేస్తానని పేర్కొన్నారు. మెదక్ మెడికల్ కాలేజీ మంజూరు కోసం గతంలో ధర్నా చేసినప్పుడు పోలీసుల దాడిలో నా కాలు విరిగిందని పేర్కొన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి.. మన మెదక్ ఏ విధంగా ఉందో చూడాలన్నారు. మెదక్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. బిఆర్ఎస్ పాలనలో పదేండ్లు మోసపోయింది ఇక చాలని, భాజాపాకు అవకాశం ఇచ్చి నీతిమంత పాలన సాగేలా చూడాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి, నాయకులు నాయిని ప్రసాద్, ఆకుల సుధాకర్, మధుసూదన్, భాగేష్, నరేష్, బెండ వీన, సంగీత, పద్మ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.