బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన బిజెపి నాయకులు
ప్రజాగొంతుక ప్రతినిధి/స్టేషన్ ఘన్పూర్:
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి,యం.ఎల్.సి కడియం శ్రీహరి నివాసం నందు లింగాల ఘనపురం బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పైడిపల్లి వెంకటేష్,పటేల్ గూడెం గ్రామం నుండి 20 మంది బిజెపి కార్యకర్తలు కడియం శ్రీహరి ఆధ్వర్వంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.వీరికి కడియం శ్రీహరి కండువాలు కప్పి బి.ఆర్.ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు
.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మేము బీజేపీ నుండి బి.ఆర్.ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో లింఘాల ఘనపురం జెడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి,పైడిపల్లి వెంకటేష్,దూసరి గణపతి,తీగల సిద్దు గౌడ్,అశోక్,మండల ముఖ్య నాయకులు, పాల్గొన్నారు.