జనగామ బిజెపి టికెట్ పై బిజెపి కార్యకర్తలు సమావేశం.
ప్రజా గొంతుక /జనగామ
జనగామ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా జిల్లా అధ్యక్షులు దశమంత రెడ్డి పేరు ప్రస్తావన రావడంతో నైరాశ్యానికి గురి అయినా బిజెపి కార్యకర్తలు ఈరోజు బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు బీసీ సంఘాలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని బేజాడి బీరప్ప అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం మరోసారి పునరాలోచించాలని కార్యకర్తల అభీష్టానికి,నాయకుల మాటకు విలువనిచ్చి బేజాడి బీరప్ప ని అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు
.పార్టీ అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో బేజాడి బీరప్ప సేవలు జనగామ ప్రజానీకానికి తెలుసని,కేవలం లాభీంగుల ద్వారా కేవలం టికెట్ తెచ్చుకున్న దశమంత రెడ్డికి కనీసం గ్రామాల పేర్లు కార్యకర్తల పేర్లు కూడా తెలవదని,ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని బిజెపి శ్రేణులు బగ్గుమంటున్నాయి.త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామని అవసరమైతే రాష్ట్ర పార్టీ దృష్టికి కూడాఈ విషయంపై కలుస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు ,కార్యకర్తలు,బూత్ కమిటీ కన్వీనర్లు గ్రామ శాఖ అధ్యక్షులు,వివిధ మోర్చాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు..