వాకర్స్ ను కలిసి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన బిఎల్ ఆర్
గ్రౌండ్లో సెటిల్ ఆడిన బిఎల్ఆర్
ప్రజాగొంతుక న్యూస్/సూర్యాపేట జిల్లా
మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని గౌట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లోని వాకర్స్ తో కలిసి మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి భారీ మెజార్టీ తో గెలిపిస్తే మిర్యాలగూడ ను అభివృద్ధి పధంలో నడిపించే విధంగా కృషి చేస్తానని అన్నారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టె 6 గ్యారెంటీ లను వివరించి కరపత్రాలను వారికి అందజేశారు. అనంతరం గ్రౌండ్లో వారితో కలిసి బి ఎల్ ఆర్ సెటిల్ ఆడారు