ఎన్ హెచ్ ఆర్ సి కొమురవెల్లి మండల మండల అధ్యక్షునిగా బొడుగం కృష్ణా రెడ్డి
నియామక పత్రాన్ని అందజేసిన – బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి
ముఖ్య అతిధి గా జనగాం జిల్లా అధ్యక్షులు మిన్నలాపురం జలందర్
ప్రజా గొంతుక/ కొమురవెల్లి
సిద్ధిపేట – కొమురవెల్లి మండలం జాతీయ మానవ హక్కుల కమిటీ మండల అధ్యక్షులు గా బొడుగం కృష్ణ రెడ్డి ని, నియమిస్తూ జిల్లా అధ్యక్షులు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు.
ఎన్ హెచ్ ఆర్ సి సంస్థ అవినీతి అక్రమాలపై రాజీలేని పోరాటం, లీగల్ ప్రొసీజర్ తో మానవ హక్కుల ఉల్లంఘనను నిరోధించడానికి నిస్వార్ధంగా పని చేస్తుందన్నారు.
తధనంతరం నూతనంగా ఎన్నికైన బోడుగం కృష్ణ రెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకంతో తమకు ఈ పదవి ఇచ్చిన జిల్లా అధ్యక్షులు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ఎన్ హెచ్ ఆర్ సి సంస్థలో సభ్యునిగా పేద ప్రజల పక్షాన ముందుండి, జిల్లా అధ్యక్షునికి ఎల్లవేళలా సహకరిస్తూ సంస్థ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తామన్నారు.