చెరువులో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం
మనోహరాబాద్ సెప్టెంబర్ 26(ప్రజా గొంతుక)
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి గ్రామంలో సోమవారం ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిన బాలుడి మృతదేహం మంగళవారం నాడు లభించింది.వివరాల్లోకి వెళితే సోమవారం బట్టలు ఉతకడానికి చెరువుకి ముగ్గురు మహిళలు,వారితోపాటు10 సంవత్సరాల బాలుడు కూడా వెళ్ళాడు.అయితే బాలుడు ఆడుకొనే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడిపోవడంతో అతడిని రక్షించడానికి ఒకరి తర్వాత ఒకరు చెరువులోకి పడిపోయి మృతి చెందారు.
ముగ్గురు మహిళల మృతదేహాలు వెలికితీసారు.బాలుడి మృతదేహం లభించకపోవడంతో పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి సోమవారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు.బాలుడి మృతదేహం మంగళవారం ఉదయం నీటిపై తేలుతూ కనిపించింది.మృతదేహాన్ని బయట తీసి పంచనామా నిర్వహించి,పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ మార్చురీకి తరలించామని ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు.