*బీ ఆర్ ఎస్ మేనిఫెస్టోతో ప్రజల జీవితాల్లో వెలుగులు
*బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గణేష్ గుప్తా
*తండాల అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమైందని వెల్లడి*
*శంషాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్ర రెడ్డి*
*రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలవబోతున్నారని వ్యాఖ్యలు*
*శంషాబాద్ ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్*
ప్రజా గొంతుక :రంగారెడ్డి జిల్లా బ్యూరో ఆర్ ఆర్ గౌడ్
రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని శంషాబాద్ మండలంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పార్టీ అధ్యక్షులు కే చంద్రారెడ్డి శంషాబాద్ ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్, జడ్పీటీసీ నిరటి తన్వీ రాజ్, వైస్ ఎంపిపి నీలం మోహన్ నాయక్ ఆధ్వర్యంలో శంషాబాద్ మండలం లోని ముచ్చింతల్, మదనపల్లి, గచ్చుభాయ్ తండా గ్రామలలో సీనియర్ నాయకులు గణేష్ గుప్తా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ముందు చూపుతో బీ ఆర్ ఎస్ మేనిఫెస్టోను ప్రజల ముందుకు తెచ్చారని.. తద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నిండడం ఖాయమని, రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో తాండల అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే టీ ప్రకాష్ గౌడ్ భారీ మెజారిటీతో గెలువ బోతున్నారని, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్. గణేష్ గుప్తా అభిప్రాయపడ్డారు. సోమవారం ఈ మేరకు వారు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ ఎంతో అభివృద్ధి చేసిందని, అలాంటి పార్టీని గ్రామీణ ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని తెలిపారు. కెసిఆర్ నాయకత్వంతో అన్ని వర్గల ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని, ముఖ్యంగా పట్టణాల నుండి గ్రామాల వరకు సిసి రోడ్లు, అండర్ డ్రైనేజ్, మిషన్ భగీరథ, స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి, క్రీడా ప్రాంగణాల ఏర్పాటు చేశామన్నారు. మరొక్కసారి ప్రజలందరూ ఆదరించి టీ ప్రకాష్ గౌడ్ ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరి మరింత అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రతి గడపగడపకు అందుతున్నాయని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరికీ మరింత ప్రయోజనం చేకూర్చడం జరుగుతుందన్నారు. ఐదు లక్షలు బీమా, ఆసరా పెన్షన్ 5000 కు పెంపు, రైతుబంధు సాయాన్ని 16 వేలకు,
రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ లాంటి కార్యక్రమాలు ప్రజాభివృద్ధికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం. ఈ కార్యక్రమంలో సోసైటీ బ్యాంక్ చర్మన్లూ భూర్కుంట సతీష్, బొమ్మ ధౌనకర్ గౌడ్, కో-ఆప్షన్ గౌస్ పాషా, పార్టీ కార్యదర్శి మోహన్ రావు , గుడాల కృష్ణ, కె రవి, డి శ్రీనివాస్ , వివిధ గ్రామాల సర్పంచ్ లు మహేందర్ రెడ్డి, రమేష్ యాదవ్, ఉపసర్పంచ్ ఆంజనేయులు, శ్రీకాంత్ గౌడ్ , ప్రవీణ్ గౌడ్, డైరెక్టర్ రాఘవేందర్, గ్రామ అధ్యక్షులు కె జనార్దన్, విద్యా చరణ్, శ్రీశైలం, శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్, దాసు, సుమన్ నాయక్, సామెల్, చరణ్, శివ, మహేష్, వెంకటేష్, ప్రశాంత్,వివిధ గ్రామ ల పార్టీ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు