Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

*పేదోడికి కొండంత సాయంగా నిలబడేందుకు మీ ముందుకు వస్తున్నాం..!*

*బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోతో ప్రజల జీవితాల్లో వెలుగు*

 

*షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్*

 

*నేడే ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ ప్రచారం*

 

*కేశంపేట మండలం బైర్ఖాన్ పల్లి గ్రామం నుండి బీఆర్ఎస్ ప్రచారం*

 

*కెసిఆర్, కేటీఆర్ అండతో ప్రచార రంగంలోకి అంజన్న*

 

 

*ప్రజా గొంతుక న్యూస్ :రంగా రెడ్డి జిల్లా బ్యూరో, ఆర్. ఆర్. గౌడ్*

 

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడంతో ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపవచ్చని

పేదోడికి కొండంత సాయంగా నిలబడేందుకు షాద్ నగర్ నియోజకవర్గంలో మీ ముందుకు వస్తున్నాం అంటూ

షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ పేర్కొంటున్నారు. 2023 శాసనసభ ఎన్నికలలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ లాంఛనంగా బైర్ఖాన్ పల్లి గ్రామం నుండి ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో  ప్రతినిధి మాట్లాడారు.

 

ఎన్నికల్లో మొదటి నుండి ప్రచారంలో ముందడుగు వేస్తున్న అధికార పార్టీ వర్గాలు నిన్న సీఎం కేసీఆర్ ప్రకటించిన సంక్షేమ అభివృద్ధి పథకాల అండతో జనాల్లో నీరాజనాలు పొందుతున్నారనీ, అన్ని వర్గాలకు పెద్దపీట వేయడం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని పేద ప్రజలకు అండ కల్పించిందని టిఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ అన్నారు. ఆసరా పెన్షన్లు, రైతుబంధు డబ్బుల పెంపుతో పాటు మహిళల కోసం ప్రత్యేక స్కీమ్‌లు ప్రకటించారనీ అర్హులైన మహిళలకు నెలనెలా భృతి అందిస్తామని ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ ప్రకటించారు. అలాగే పేద మహిళలకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలోని మరిన్ని ముఖ్యాంశాల గురించి ఆయన ప్రస్తావిస్తూ..

అందరికీ సన్నబియ్యం పథకం

బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇస్తామని ఎమ్మెల్యే అంజయ్య చెప్పారు.

కేసీఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా పథకం ద్వారా ప్రభుత్వం తెల్లకార్డు కలిగిఉన్న ప్రతి పేద ఇంటికి రైతుబీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా 5 లక్షల రూపాయల జీవిత బీమా అందిస్తామని అన్నారు

ఆసరా పెన్షన్ల పెంపుపై మాట్లాడుతూ.. ఆసరా పెన్షన్లను ఐదేండ్లలో 5 వేల రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. మొదటి సంవత్సరం వెయ్యి పెంచుతం అంటే 3,016 రూపాయలకు పెంచుకుంటం. దివ్యాంగులకు పెన్షన్ ఈ మధ్యనే 4,016 రూపాయలకు పెంచినం. రాబోయే ఐదేళ్లలో 6,016 రూపాయలకు పెంచుతం అని స్పష్టం చేశారు. రైతుబంధు సాయం పెంపు గురించి వివరిస్తూ.. ఇప్పుడు రైతుబంధు కింద ఇస్తున్న పంట పెట్టుబడి సాయం – ఎకరానికి ఏటా 10,000 రూపాయలు

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రైతుబంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12,000 రూపాయలకు పెంచుతుందని హామీ కెసిఆర్ ఇచ్చారని, వచ్చే ఐదేండ్లలో రైతుబంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ.. గరిష్టంగా ఎకరానికి ఏటా 15,000 రూపాయలకు పెంచుతం అని హామీ ఇస్తున్నాం ఆని తెలిపారు.

ధాన్యం కొనుగోలు పాలసీని యధావిధిగా కొనసాగిస్తాం ఆన్నారు. అర్హులైన మహిళలకు నెలకు 3 వేల భృతి అందిస్తామని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలందరికీ ప్రతినెలా 3,000 రూపాయల జీవన భృతిని అందిస్తాం అది స్పష్టం చేశారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండరు అందిస్తాం అనీ జర్నలిస్టులకు కూడా రూ. 400కే సిలిండర్‌ ఇస్తామని వివరించారు. ఇపుడు ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 5 లక్షలుగా ఉందనీ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పరిమితిని 15 లక్షలకు పెంచుతుందని హామీ ఇస్తున్నాం అని అన్నారు.

పేదలకు ఇండ్ల స్థలాలు

రాష్ట్రంలో ఇంటి జాగ లేని నిరుపేదలకు బీఆర్ఎస్ ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని హామీ ఇస్తున్నాం అని ప్రస్తుతం అమలవుతున్న హౌసింగ్ పాలసీ చక్కగా ఉంది కనుక దాన్ని అలాగే కొనసాగిస్తాం అన్నారు.

అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తాం అని రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సమాఖ్యలన్నింటికీ సొంత భవనాలు నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాం అన్నారు.

పట్టాదారుడు అయితే భూమిని అమ్ముకునే అవకాశం ఉందనీ కొన్ని చోట్ల రాళ్లు గుట్టలు ఉన్న దగ్గర కూడా కోట్ల రూపాయల డిమాండ్‌ ఉంది. అటువంటి చోట భూములు అమ్ముకుంటే మరోచోట పదెకరాలు కొనుకుంటున్నారు. కానీ వీళ్లకు అలాంటి సదుపాయం లేదు. దాన్ని రిలీవ్‌ చేయాలని దళిత సోదరులు కోరుతున్నారని ఈ అసైన్డ్‌ భూములపై కూడా పార్టీలతో సంబంధం లేకుండా దళిత ప్రజాప్రతినిధులు అందర్నీ సమావేశపరిచి ఒక పాలసీ రూపొందించి.. అసైన్‌డ్‌ భూములపై ఆంక్షలు ఎత్తివేసి.. మామూలు పట్టాదారుల్లా హక్కులు కల్పించే ప్రయత్నం బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తుందని కొనియాడారు. సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు తమకు పూర్వమున్న పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నారనీ దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని సిఎం కేసిఆర్ నియమిస్తారని నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని అంతేకాదు అనాథలైన పిల్లల కోసం ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నారని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు రూపొందించిందని దేశంలో మరెక్కడా లేకుండా తెలంగాణలో ఒక ఉద్యమంలా సంక్షేమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ప్రజల ఆశీర్వాదం ఉంటే మరొకసారి పేదోడికి కొండంత నిలబడి సాయంగా నిలబడేందుకు ముందుకు వస్తున్నామని అంజయ్య అన్నారు.

Leave A Reply

Your email address will not be published.