*దేవరకొండ పట్టణంలో బీఎస్పీ గడప గడప ప్రచారం.*
ప్రజా గొంతుక నవంబరు 19 దేవరకొండ జిల్లా నల్గొండ
*దేవరకొండ ఖిల్లా పై నీలి జెండా ఎగరవేస్తాం*
*బి.ఆర్.ఎస్ కాంగ్రెస్ పాలనలో దేవరకొండ మున్సిపాలిటీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు.*
*బిఎస్పి అధికారంలోకి వస్తే దేవరకొండ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా -డాక్టర్ వెంకటేష్ చౌహన్*
ఎన్నికల ప్రచారంలో భాగంగా బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వెంకటేష్ చౌహన్ దేవరకొండ పట్టణంలో ప్రచారం నిర్వహించడం జరిగింది.
దేవరకొండ పట్టణంలో వివిధ వార్డులో ప్రచారం సందర్భంగా ప్రజలనుదేశించి డాక్టర్ వెంకటేష్ చౌహన్ మాట్లాడుతూ 60 సంవత్సరాల కాంగ్రెస్, 10 సంవత్సరాలు బి.ఆర్.ఎస్ పాలనలో దేవరకొండ పట్టణం ఎటువంటి అభివృద్ధికి నేర్చుకోలేదు. దేవరకొండలో ఇప్పటి వరకు ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, అంతర్గత రోడ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉందన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేస్తే దేవరకొండ మున్సిపాలిటీని తెలంగాణలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బాంసెప్ అధ్యక్షులు ఏకుల రాజారావు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎర్ర యాదయ్య ఉపాధ్యక్షులు దున్న బాలకృష్ణ, నియోజకవర్గ మహిళా కన్వీనర్లు సహని లలిత, చేరికల కమిటీ చైర్మన్ కొండ్రపల్లి రమేష్, మీడియా అండ్ కమ్యూనికేషన్ ఇంచార్జ్ వింజమూరి శేఖర్, ఎన్నికల కన్వీనర్ కామేపల్లి సైదులు, బీ.వి.ఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ భరత్ కో కన్వీనర్ పోలే బాలకృష్ణ నేరేడుకొమ్ము కన్వీనర్ మధు, డిండి మండల ఆర్గనైజింగ్ సెక్రెటరీ జుట్టు సతీష్, సోషల్ మీడియా ఇంచార్జి గడ్డం చరణ్ తేజ్, ప్రజా గాయకుడు ఆరెకంటి జగన్, ఎస్.ఎస్.యు. ప్రధాన కార్యదర్శి ఇంజమురి అనిల్, నాయకులు మురళి, నితిన్, అజయ్ రెడ్డి, గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.