*కెటిఆర్ షాద్నగర్ గడ్డ మీద కాలు మోపొద్దు బిఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్*
*ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లతో గద్దెనెక్కి హామీలు గాలికా*
*అంబేద్కర్ భవన నిర్మిస్తామని మాట ఏమైంది*
*జర్నలిస్టులకు ఇస్తామన్న ఇళ్ల స్థలాల సంగతేంది*
*లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మించకపోతే ఓట్లాడుగామన్న మాట మీద ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నిలబడాలి*
*కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని ప్రెస్ మీట్ లో బిఎస్పి డిమాండ్*
ప్రజా గొంతుక న్యూస్ :రంగా రెడ్డి జిల్లా బ్యూరో
షాద్ నగర్ నియోజకవర్గం లో డబల్ బెడ్ రూమ్ ప్రారంభోత్సవానికి వస్తున్న టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు పంచాయతీరాజ్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు పర్యటనను అడ్డుకుంటామని షాద్ నగర్ బీఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ప్రజల్ని మాయమాటలతో మోసం చేయడానికి మళ్లీ బయలుదేరాడని దుయ్యబట్టారు,
స్థానిక యువతకు పరిశ్రమలలో 70 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీని నెరవేర్చకుండా ఏం మొహం పెట్టుకొని పర్యటనకు వస్తున్నారని ఇదే వచ్చేసరు, గత ఎన్నికల్లో దళిత ఓట్లతో గద్దెనెక్కిన టిఆర్ఎస్ ప్రభుత్వం, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య, అంబేద్కర్ భవన నిర్మాణం చేయకుండా దళితులను బహుజనులను మోసం చేసిందని నిలదీశారు, హామీలు నెరవేర్చని మోసపూరిత నేతలను షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ను, రేపు మినిస్టర్ పర్యటనను అడ్డుకొనుటకు ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఏకమై పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు,
ఈ కార్యక్రమంలో నియోజవర్గ ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్, నియోజకవర్గ కార్యదర్శి దానిని ఇంద్రసేన, తాలూకా బివిఎఫ్ కన్వీనర్ తొండపల్లి దర్శన్, పరుక్ నగర్ మండల అధ్యక్షులు తుప్పరి కుమార్ స్వేరో, రేగడి చిలకమారి సెక్టార్ అధ్యక్షులు ఉదయ్ కుమార్, కమ్మదనం గ్రామ బిఎస్పి యూత్ అధ్యక్షుడు శివగల వంశీ మరియు చందు తదితరులు పాల్గొన్నారు.