విద్యార్థి ఉద్యమ నాయకుడికి బిఎస్పి టికెట్
ప్రజా గొంతుక సెప్టెంబర్ 25 దేవరకొండ జిల్లా నల్గొండ
**దేవరకొండ నియోజకవర్గం బిఎస్పి అభ్యర్థిగా గిరి జన పోరాట బిడ్డ -డాక్టర్ వెంకటేష్ చౌహన్
*-త్వరలో అధికారిక ప్రకటన
*-రసవత్తరంగా మారునున్న దేవరకొండ అసెంబ్లీ ఎన్నిక.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండ నియోజకవర్గం హాట్ సీటుగా మారనుంది. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి బలమైన ద్యిముఖ పోటీ ఉండబోతున్నట్లు ఇప్పటికీ ఉన్న పరిస్థితులను చూస్తుంటే స్పష్టమవుతుంది.
కాగా ప్రస్తుత ఈ రాజకీయ ముఖచిత్రంలో ముడవ రాజకీయ పార్టీ బిఎస్పి ఎంటర్ కాబోతుందని తెలుస్తుంది. బిఎస్పి తరఫున దేవరకొండ నియోజకవర్గం బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ మూడవత్ వెంకటేశ్ చౌహన్ బరిలో ఉండబోతున్నారని సమాచారం. బిఎస్పి స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వచ్చేనెల మొదటి వారంలో ఆ పార్టీ తరఫున పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు వినికిడి.
ఈ క్రమంలోనే దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న వెంకటేష్ చౌహన్ బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తారని టాక్. ఇప్పటికే ఈ విషయమై డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పలు బహిరంగ సభలలో పేర్కొన్నారు. భవిష్యత్తులో వెంకటేష్ చౌహన్ గొప్ప నాయకుడిగా ఎదుగుతారని ఆయన కొనియాడారు.
డాక్టర్ వెంకటేష్ చౌహన్ నిజాం కళాశాలలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ స్వరాష్ట్ర కోసం ఉద్యమించాడు… అలాగే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో గెలిచి విద్యార్థి సమస్యలపై ఉద్యమించడం జరిగింది. అదేవిధంగా రోహిత్ వేముల సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కుల వివక్షకు గురై ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించి ఆ ఉద్యమంలో చర్లపల్లి జైల్లో రెండు వారాలపాటు జైలు జీవితాన్ని గడిపిన ఉద్యమ నాయకుడు..
అలాగే వివిధ సామాజిక అంశాలపై పోరాటం చేయడంతో పాటు..గిరిజన శక్తి అనే సంఘాన్ని స్థాపించి గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధించడం జరిగింది. గ్రామాలు,తండాలలో సంత్ సేవాలాల్ మహారాజ్ , బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం నిరంతరం పోరాడిన యువ నాయకుడిగా పేరుంది.
వెంకటేష్ చౌహన్ ఇప్పటికే దేవరకొండ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ నిర్మాణం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బహుజనులకు రాజ్యాధికారం బిఎస్పితోనే సాధ్యమని ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏనుగు గుర్తుకు ఓటేసి బహుజన రాజ్యం సాధించటం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రజలను అభ్యర్థిస్తున్నారు. చదువుకున్న ఇంటలెక్చువల్ గిరిజనుల కొంతుకైన డాక్టర్ వెంకటేష్ చౌహన్ చట్టసభల్లోకి వెళ్లాలనే, డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆలోచన గొప్పదని దేవరకొండ లోని విద్యావంతులు, మేధావులు ఆశాభావం వ్యక్తం చేశారు. చౌహాన్ కు అవకాశం వస్తే ప్రశ్నించే బహుజన గొంతుకై చట్టసభల్లో అడుగుపెట్టి పేద ప్రజల కోసం పోరాడుతాడని దేవరకొండ బహుజన ప్రజలు ఆశిస్తున్నారు.
చూడాలి మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండలో డాక్టర్ వెంకటేష్ చౌహన్ ఏ మేరకు ప్రభావితం చేస్తారో…..