*కవులులేని సమాజాన్ని ఊహించలేం ! జడ్చర్ల శాసనసభ్యులు డా.సి.లక్ష్మారెడ్డి.
ప్రజా గొంతుక /జడ్చర్ల ప్రతినిధి:
కవులు,కళాకారులు ఉత్తమ సమాజ నిర్మాణంలో కీలక భాగస్వామ్యం.కలిగివుంటారని, కవులు లేని సమాజాన్ని ఊహించలేమని జడ్చర్ల శాసనసభ్యలు డా.సి.లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం నాడు స్థానిక ప్రేమ్ రంగా గార్డెన్స్లో జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఆంగ్ల ఉపన్యాసకులు విల్గొండ జానకీరాములు గౌడ్ రచించిన ‘ “సిరాచుక్క” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
స్వాతంత్ర్యోద్యమ కాలంలోనూ, తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ కవుల పాత్ర మహోన్నతమని కొనియాడారు. సమాజంలో జరుగుతున్న మంచిని మంచిగా, చెడును చెడుగా మనసులో భావించడమే కాదు,పది మంది కలసినపుడు ఆవిషయాలపై చర్చ జరగాలన్నారు. సమాజ హితాన్ని కోరేదే సాహిత్యం కాబట్టి మంచి పుస్తకాలను అందరూ ఆదరించాలన్నారు. సభాధ్యక్షులుగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత డా. ఉమ్మెంతల మహేశ్వర్, పుస్తక సమీక్షకులు సాకేత ప్రవీణ్.రాష్ట్ర సంగీత నాటక అకాడమీ తొలి అధ్యక్షులు బాద్మీ శివకుమార్, చక్రవర్తుల రమణాచార్యులు, చిగుళ్ళపల్లి పద్మలీల,యలకంటి భాస్కర్ తదితరులు ప్రసంగించారు .ఈ సందర్భంగా
స్థానిక బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులచే, విశ్వవికాస్ కళాశాల విద్యార్థులచే కవిసమ్మేళనం నిర్వహించారు .జాతీయ సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి చక్రవర్తుల కిరణ్మయి, ప్రచారకారాదర్శి గోనెల రాధాకృష్ణ, బీయారెస్ నాయకులు పాలాది రాంమోహన్, కౌన్సిలర్లు సతీష్ ముదిరాజ్, కోట్ల ప్రశాంత్ రెడ్డి, బందెల రాజేందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ గాడ్,ఆర్. నర్సిములు, రత్నశేఖర్, సింగిల్ విండో చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, రాజేష్ గౌడ్, గంటా వెంకటేశ్వర రెడ్డి, మురళి, రమేష్, పూర్ణచంద్రరావు,మధుసూదన గౌడ్, అంబీశ్వర్, రమేశ్ మూడావత్, చిట్టిపాల వెంకటేశ్, సాయితేజ, జగదీశ్, నరేష్, నవీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భువనవాణి, తేజస్విని,శివాని, గౌతమి లు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు అందరినీ అలరించాయి.
చక్రవర్తుల కిరణ్మయి ప్రధాన కార్యదర్శి