జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవాలి
శ్రీమతి.రోహిణి ప్రియదర్శిణి ఐ.పి.యెస్
పాపన్నపెట్ ప్రజా గొంతుక న్యూస్
జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిణి ఐ.పి.యెస్ . మాట్లాడుతూ… ఈ నెల 02.09.2023 నుండి 09.09.2023 వరకు జిల్లా కోర్ట్ లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఉన్నదని కావున జాతీయ లోక్ అదాలత్ లో సామరస్య ధోరణితో రాజీ పడదగిన వివిధ కేసుల పై న్యాయ స్థానాల చుట్టూ తిరగకుండా కేసుల పరిష్కారం చేసుకోవాలని సూచించారు.
అలాగే జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడే అవకాశం ఉన్న కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలని, రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాల వారిని పిలిపించి చిన్నచిన్న కేసులతో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఒకే గ్రామంలో ఉండే వారు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి రాజీ మార్గం రాజ మార్గమని వారికి అర్థమయ్యే విధంగా
తెలపాలని జిల్లా సిబ్బందికి సూచించారు. అలా లిస్ట్ అవుట్ చేసిన కేసులలో అన్ని కేసులు రాజీ పడేటట్లు ప్రతి కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్స్ మరియు కోర్ట్ కానిస్టేబుళ్లు మరియు సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. న్యాయశాఖ అధికారులతో సమన్వయం ఏర్పరచుకొని విధులు నిర్వహించాలని సూచించారు.జాతీయ లోక్ అదాలత్ లో సాధ్యమైనంతవరకు
ఎక్కువ మొత్తంలో కేసులు రాజీ కుదిరేలా చూడాలని అన్నారు. కోర్టు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి రాజీ కాదగ్గ కేసులలో రాజీ శాతం పెంచాలని సూచించారు
. ఈ రాజీ కేసులు మెదక్ పట్టణంలోని 8వ అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జ్ కోర్ట్ ఆవరణలో ఈ నెల 02.09.2023 నుండి 09.09.2023 వరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహింపబడుతుందని అన్నారు.