రెండు లక్షల 50 వేల రూపాయల నగదు సీజ్…
-పొత్కపల్లి ఎస్సై ఎన్. శ్రీధర్ …
ప్రజా గొంతుక ఓదెల :
పొత్కపల్లి ఎస్సై. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం ఓదెల మండలం గుంపుల శివారు చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా జమ్మికుంట నుండి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆటో ట్రాలీని తనిఖీ చేయగా
ఆటో ట్రాలీ డ్రైవర్ మొగిలి వద్ద ఎలాంటి రసీదులు పత్రాలు లేనటువంటి రెండు లక్షల 50 వేల రూపాయలు
స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎన్. శ్రీధర్ తెలిపారు ఎన్నికల నిబంధన మేరకు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు ఈ నగదును తదుపరి విచారణ నిమిత్తం ఫ్లయింగ్ స్క్వాడ్ ఇంచార్జ్ వరప్రసాద్ కు అప్పజెప్పడం జరిగిందన్నారు.