Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

*గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోండి

 

*శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి

 

*శంషాబాద్ భారత్ చౌరస్తా లో ఆవుల శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన*-

*వినాయక మండపాలను సందర్శించిన పోలీసు అధికారులు*

 

ప్రజా గొంతుక న్యూస్ :శంషాబాద్

 

ఈ నెల 18వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్‌ 28వ తేదీ వరకు కొనసాగే గణేష్‌ నిమజ్జనానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై శంషాబాద్ పట్టణంలో శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి శంషాబాద్ , సిఐ , ఎసై ఇతర అధికారులతో కలిసి పట్టణంలో పలుచోట్ల పర్యటించారు. గణేష్ మండపాల వద్ద నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్న నిర్వాహకులతో మాట్లాడారు వారికి దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు భారత్ చౌరస్తా ఆవుల. శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాన్ని సందర్శించారు. ఇంకా పలువురు నిర్వాహకులతో మాట్లాడారు. అంతకుముందు . ఇప్పటివరకు జరిగిన అన్ని మతాలకు చెందిన అన్ని పండుగలు,

 

వేడుకలు ఇతర అన్ని కార్యక్రమాలు సాఫీగా జారిగాయన్నారు. ఈసారి గణేష్‌ నిమజ్జనం 28 వ తేదీన మరియు 30 ఏళ్ల తర్వాత ఈద్‌ మిలాధ్ ఉన్ నబీ ఒకే రోజున వచ్చే అవకాశం ఉన్నందున. వేడుకలను కూడా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా వేడుకలను ప్రశాంతమైన వాతవరణంలో జరుపుకోవాలన్నారు. ఇందులో భాగంగా స్ధానిక పోలీసు అధికారులకు డిసీపి దిశా నిర్దేశం చేశారు. ఈ సంవత్సరంలో జరుపుకొనే అతి పెద్దదైన గణేష్‌ వేడుకలను ‘‘ఇన్సి డెంట్‌ ఫ్రీగా ఘనంగా జరుపుకోవాలని ఆయన అన్నారు. గణేష్‌ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో, ఇన్‌ స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారన్నారు.

 

గణేష్‌ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల్లో సమస్యని రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. గణేష్‌ నిమజ్జనం మొదలుకొని అంతా ముందుగా ప్రణాళిక ప్రకారం జరగాలని ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఆయన కోరారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లోని పౌర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.

 

రానున్న గణేష్‌ నవరాత్రోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతకు సంబంధించిన అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగిన వెంటనే 100 డయల్ చేయాలని పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా భారత్ చౌరస్తా యూత్ అసోసియేషన్ నిర్వాహకులు సన్మానించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు భారత్ చౌరస్తా యూత్ సభ్యులు, ప్రవీణ్, ఆవుల కిరణ్, ఆవుల మహేష్, ఆవుల సాగర్ ఆవుల నవీన్,ఆవుల అన్ను,మంకర్ రాజు

మంకర్ దినేష్ ఇతరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.