Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

కెవిపిఎస్ ఆవిర్భావ వారోత్సవాలను జయప్రదం చేయండి

ప్రజా గొంతుక ప్రతినిధి షేక్ షాకీర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని మండల కేంద్రాలలో గ్రామాలలో జండా ఆవిష్కరణ నిర్వహించి వారోత్సవాలను జరపాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను తెలిపారు. సోమవారం హాలియాలోని సంఘం కార్యాలయంలో కెవిపిఎస్ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం ఆయన మాట్లాడారు.

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న అనేక గ్రామాలలో కుల వివక్ష వివిధ రూపాల్లో కొనసాగుతుందని, దళితులపై అనేక దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. సంఘం గత 25 సంవత్సరాలుగా దళితుల సంక్షేమం కోసం దళితుల అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేసిందని, దళితులకు సబ్ ప్లాన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, దళితులకు స్మశాన వాటికలు అనేక విజయాలు సాధించిందని అన్నారు. దళితులకు బడ్జెట్లో వాటాలు పెంచాలని, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని పోరాడుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 88 కుల దురహంకార హత్యలు జరిగాయని వాటికి వ్యతిరేకంగా, బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేసిందని, రిజర్వేషన్లు తొలగించాలని, రాజ్యాంగాన్ని మార్చాలనే రాజ్యాంగ వ్యతిరేకులకు, మతోన్మాదులకు బుద్ధి చెప్పడానికి దళితులు ఐక్యంగా పోరాడాలని ఆయన అన్నారు.

 

ప్రభుత్వాలు కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన కోరారు. దళితులు ఆత్మగౌరవంతో సమాజం లో బతకాలి అంటే, భూమిలో, సంపద లో, బడ్జెట్ లో వాటా కావాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వాలని అన్నారు. దేశంలో మతోన్మాదం పెరుగుతుందని, మతోన్మాద దాడులు అధికమయ్యాయి అని, మతోన్మాదుల నుండి దళితులు ఐక్యంగా పోరాడాలని అయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు దొంతాల నాగార్జున, దోరెపల్లి మల్లయ్య, వింజమూరు శివ, కందుకూరి కోటేష్, పేర్ల బాలు, కోరే రమేష్, చిన్న కొమ్ము జీవన్, కొండేటి సామంతు,కొండేటి సైదులు, బాసిపాక సైదులు, బసిపాక కరుణాకర్, ఇంజమూరి పుల్లయ్య, చందు, ఇరుగంటి కాశయ్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.