27న జరగబోయే సంయుక్త కిసాన్ మోర్చ మండల సదస్సును జయప్రదం చేయండి
ప్రజా గొంతుక ప్రతినిధి/అశ్వరావుపేట నియోజకవర్గం,
ములకలపల్లి మండలం కేంద్ర రాష్ట్ర అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక వ్యవసాయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 27 వ తేదీన ములకలపల్లి మండల కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చ మండల సదస్సును జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నూపా భాస్కర్ పిలుపునిచ్చారు
ఈ రోజు ములకలపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గుత్త పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టాలని కుట్ర చేస్తున్నదని దీని ద్వారా రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ రంగం పై ఆధారపడి జీవిస్తున్న కోట్ల మంది ప్రజలు పేదరికం వైపు నెట్టివేయబడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో సమరశీ పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు
ఈకార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కల్లూరి కిషోర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ముదిగొండ రాంబాబు, ఎఐటియుసి నాయకులు యం. డి యూసుఫ్, రైతు సంఘం మండల కార్యదర్శి వూకంటి రవికుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పోతుగంటి లక్ష్మణ్, కల్లూరి పద్మ, సిహెచ్ వెంకటేశ్వర్లు, గడ్డం వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.