పువ్వాడ అజయ్ ని కలసి చర్ల మండల బిఆర్ఎస్ నాయకులు
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
ఈరోజు ఖమ్మం లో మంత్రివర్యులు పువ్వాడ అజయ్ ని కలసి చర్ల లో సిహెచ్సి మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేయుట జరిగింది.అలాగే చర్ల పర్యటన ఏర్పాటు చేసుకొని సిహెచ్సి కి శంకుస్థాపన చేయవలసిందిగా కోరడం జరిగినది.
అలాగే చర్ల మండలం లో పార్టీ పరిస్థితి అడిగి తెలుసుకుని,వివిధ రకాల సంక్షేమ పథకాల అమలు, దళిత బంధు,బీసీ బంధు,గృహలక్ష్మి తదితర పథకాల అమలు గురించి మంత్రి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ డైరెక్టర్ పరుచూరి రవికుమార్ , రైతుబంధు సమితి చర్ల మండల కోఆర్డినేటర్ కొసరాజు రాజా ,
చర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ ,కాపుల కృష్ణార్జునరావు, మాజీ మండల ప్రధాన కార్యదర్శి బండి వేణు, చర్ల మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోడుమల్ల వరప్రసాద్, మండల జాయింట్ సెక్రటరీ, పిఎసిఎస్ డైరెక్టర్ పందిళ్ళపల్లి రాధాకృష్ణమూర్తి, తడికల రమేష్ తదితరులు పాల్గొన్నారు.